May 21,2023 15:11

ప్రజాశక్తి-తిరుపతి సిటీ : తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సమావేశ మందిరంలో నేడు ఆంధ్రప్రదేశ్ బిసి ఉద్యోగుల ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పాల్గొన్న ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. బిసిల అభివృద్ధికి వారి సంక్షేమం కోసం పాటు పాడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సారద్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. బిసిలకు రాజ్యాధికారం కల్పించాలన్నా, చట్ట సభలలో వారి సమస్యలు వినిపించాలన్నా ఆర్.కృష్ణయ్య లాంటి ఉద్యమకారుడి చేతిలో పదవి ఉంటేనే సాధ్యమని పెద్దల సభ అని పిలిచే రాజ్యసభకు ఎంపిక  చేసిన ఘనత మా నాయకుడు జగన్మోహనరెడ్డికే చెందిందని అన్నారు. మా నాయకుడి అడుగుజాడల్లో నడుస్తూ ఢిల్లీలో ఆర్.కృష్ణయ్యతో కలిసి బిసిల సమస్యలపై అన్ని వేదికలపై పోరాటం చేస్తున్నామని బిసిల హక్కుల సాధనకు కట్టుబడి ఉన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.