Apr 10,2023 15:43

ప్రజాశక్తి-పాకాల : రానున్న సార్వత్రిక ఎన్నికలను ఉద్దేశించి అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి మరియు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలు పోటాపోటీ అన్నదాన కార్యక్రమాలు చేయడం ద్వారా పాకాలలో రాజకీయాలు వీడెక్కడం మొదలైంది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో సోమవారం ఈ రెండు పార్టీలు అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాయి. మండలంలో ఈ రెండు పార్టీలు పట్టణ కేంద్రంలో ఒకేసారి రోజు  అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పలువురు పలు విధాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల మండల రాజకీయాలు ఎలక్షన్ కోడ్ రాక ముందే తరా స్థాయికి చేరుకోవడం పట్ల పలు విమర్శలకు తావిస్తోంది. 2019 ఎన్నికల తర్వాత ఎప్పుడు లేని విధంగా రానున్న సార్వత్రిక ఎన్నికలు దగ్గరలో ఉందని ఓట్ల కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పలువురు అనుకుంటున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు పాకాల మండలంలో రాజకీయాలు ఇలాగ ఉండబోతుందో అని వేచి చూడాల్సిందే