ప్రజాశక్తి-రాజవొమ్మంగి : మండలం చిన్న రెల్లంగిపాడు గ్రామంలో పాసెం శేషగిరి అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలో నాటిన అంజూర చెట్టుకు పళ్ళు గుత్తులు విరగాసాయి ఇవి చూపరులను ఎంతగానో అబ్బురపరుస్తున్నాయి. రైతు 4ఏళ్ళ క్రితం నాటిన చిన్న మొక్క పెరిగి నేడు వందల కొలది కాయలతో కళ కళ లాడుతుంది, చల్లటి వాతావరణంలో ఎప్పుడూ నీరు ఉండడంతో ఈ మొక్క ఎపుగా పెరిగింది, పండు చాలా రుచిగా ఉండడంతోపాటు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని రైతు తెలిపారు. ఒకే సారి ఎక్కువ పళ్ళు రావడంతో వీటిని ఎండబెట్టుకుని కూడా తిన వచ్చుని రైతు తెలిపారు. ఐరన్ తో బాటు, పలు పోషకాలు కలిగిన ఈ పండు ను చుసిన వారు తినకుండా ఉండలేరు. ఈ పళ్ళు రోజుకి నాలుగు చొప్పున తీసుకుంటే బరువు తగ్గడానికి దోహదపడుతుందని గ్రామస్తులు తెలిపారు. ఎటువంటి ఎరువులు, పురుగు మందులు వాడకుండానే కాయలు కాసాయని రైతు తెలిపారు.










