- గ్రామ గ్రామాల నుంచి కదిలి వచ్చిన అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు,
- అల్లూరి జిల్లా కేంద్రంలో ఐటిడిఏ ఎదుట బైఠాయింపు ధర్నా
ప్రజాశక్తి-పాడేరు : తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపుమేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటిడిఏ కేంద్రం వద్ద అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు 36 గంటల మహాధర్నా చేపట్టారు. అల్లూరి జిల్లాలోని పాడేరు చింతూరు రంపచోడవరం ఐటీడీఏల పరిధిలో అంగన్వాడీ వర్కర్లు ఈ మహాధర్నా నిర్వహిస్తున్నారు. పాడేరు ఐటిడిఏ ఎదుట పెద్ద ఎత్తున తరలివచ్చిన అంగన్వాడీ వర్కర్లు తమ సమస్యలపై నినదిస్తూ ధర్నా చేపట్టారు గ్రామ గ్రామాల నుంచి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు వందలాదిగా తరలివచ్చారు. తమకు తెలంగాణ కంటే అధికంగా వేతనాలు పెంచాలని ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించాలని తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ పలు సమస్యలపై అంగన్వాడీలు నినాదాలు సాగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు ఈ మహా ధర్నాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం రాకముందు వైసిపి జగన్ పాదయాత్రలో అంగన్వాడీలకు ఓట్లు రాబట్టడం కోసం అనేక రకమైన హామీలు ఇచ్చారని ఏ ఒక్కటి నెరవేర్చలేదని తెలిపారు. తెలంగాణ కంటే అదనంగా జీతం చెల్లిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. మాట తప్పను మడమ తిప్పను అన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అంగన్వాడిని రాష్ట్ర ప్రభుత్వం జగన్ మోసం చేశారని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంగన్వాడీలకు కనీస వేతనాలు గ్రాట్యూటీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఆదేశాలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని అంగన్వాడీలంటే ప్రభుత్వాలకు చిన్న చూపుగా ఉందని అన్నారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు వేతనాలు పెంచే ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని లేకుంటే రాజధాని కేంద్రాన్ని ముట్టడిస్తామని తెలిపారు సిఐటియు జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తించడం లేదని అన్నారు ఐసిడిఎస్ బడ్జెట్ను పెంచాలని డిమాండ్ చేశారు. ధరలు పెరిగిపోతున్న వేతనాలు పెరిగిపోవడంతో అంగన్వాడీలు ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారని పని ఒత్తిడి భారంగా ఉందని అన్నారు పనికి తగ్గ వేతనాలు చెల్లించడం లేదని తెలిపారు. తక్షణం సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కే భాగ్యలక్ష్మి అధ్యక్షతన ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్బిఐ పోతురాజు, భగత్ రామ్, సహాయ కార్య దర్శి కిలో మొస్సాయ, సన్నీ బాబు, శంకర్రావు, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు మంగమ్మ, గిరిజన సంఘం నాయకులు , అంగన్వాడి జిల్లా నాయకులు కళావతి, కొండమ్మ, వెంకటలక్ష్మి, పెంటమ్మ తదితరులు పాల్గొన్నారు.










