ప్రజాశక్తి-రాజవొమ్మంగి : మండలంలోని రాజవొమ్మంగి బీసీ కాలనీ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి వర్కర్ గా పనిచేస్తున్న చీడి బేబీ 50 శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. చీడి బేబీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు,బేబీ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ శనివారం ఇంటి వద్ద మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు,సీనియర్ అంగన్వాడి వర్కర్ అయిన బేబీ గతంలో అంగన్వాడీ వర్కర్ల సమస్యలపై జరిగిన పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు,బేబీ మృతదేహాన్ని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు కె వెంకటలక్ష్మి,మండల అధ్యక్షురాలు సిహెచ్ కుమారి తదితరులు సందర్శించి నివాళులర్పించారు, అంగన్వాడి వర్కర్ బేబీ మృతికి అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బి నిర్మల, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి రామరాజు,సిఐటియు మండల నాయకులు సంతాపం తెలియజేశారు.










