మదనపల్లె అర్బన్ : అధికార వైసిపి అన్యాయాలని ప్రశ్నిస్తే పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గమని రాజంపేట పార్లమెంటు టిడిపి అధికార ప్రతినిధి ఆర్.జె.వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన తెలుగు యువత రాజంపేట పార్లమెంట్ ఉపా ధ్యక్షులు పి.సుదర్శన్ రెడ్డి సోషల్ మీడియాలో స్థానిక ఎమ్మెల్యే అక్రమంగా ఇసుక, మట్టి రవాణా చేస్తున్నారనే విషయాన్ని పోస్టింగ్ పెట్టారని, అధికార పార్టీ నాయకులు ఆదేశాలతో మదనపల్లి వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారన్నారు. సుదర్శన్ రెడ్డి అరెస్టు విషయం తెలుసుకున్న వెంటనే తంబ ళ్లపల్లి, మదనపల్లి నియోజకవర్గాల నుండి వందలాదిగా టిడిపి కార్య కర్తలు మదనపల్లి తరలివచ్చారన్నారు. తంబళ్లపల్లి మాజీ శాసన సభ్యులు జి.శంకర్ యాదవ్ పోలీసులతో మాట్లాడగా సుదర్శన్‌రెడ్డిని విడు దల చేశారు. సొసైటీ కాలనీలో మాజీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సుదర్శన్‌రెడ్డిని పరా మర్శించి, టిడిపికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అధికార వైసిపికి ఘోరపరాభవం తప్పదని అన్నారు. ఇప్పటికే ప్రజలు వైసిపి పాలనల విరక్తితో ఉన్నారని అన్నారు. చంద్రబాబు మరల సిఎం కావడం తథ్యమన్నారు. ఆర్.జె.వెంకటేష్ వెంట యాళగిరి దొరస్వామి నాయుడు, టిడిపి నాయకులు ఉన్నారు.
సుదర్శన్‌రెడ్డిని పరామర్శిస్తున్న ఆర్.జె.వెంకటేష్,నాయకులు










