ప్రజాశక్తి-కాకినాడ ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవిస్తూ ఒకరి భావాలను మరొకరు గౌరవిస్తూ యుద్ధ వాతావరణం లేని సమాజాన్ని నిర్మించాలని జిల్లా సైన్స్ అధికారి ఎంఎ.శ్రీనివాస వినీల్ పిలుపునిచ్చారు. స్థానిక ఎంఎస్‌ఎన్ చారిటీస్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఎపి శాస్త్ర సాంకేతిక మండలి, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం హిరోషిమా డే సందర్భంగా క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లాలో 32 పాఠశాల నుంచి 136 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి ఎం.శ్రీనివాస వినీల్ మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి సాధించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు ఎంఎస్.సుబ్రమణ్యం, బాలవేదిక కన్వీనర్ నోరి బలరామకష్ణ, అంబేద్కర్ కోనసీమ జిల్లా సైన్స్ అధికారి జివిఎస్ సుబ్రమణ్యం, రిసోర్స్ పర్సన్ కెవిఎస్ ప్రసాద్, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా అకడమిక్ కో ఆర్డినేటర్ కె.వెంకటరావు మాట్లాడారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు, జెవివి నాయకులు బివివి.సత్యనారాయణ పాల్గొన్నారు.










