Oct 08,2023 00:12

పల్నాడు జిల్లా: అనవసరంగా అలారం చైన్‌ లాగడం, రైళ్లపై రాళ్లు రువ్వడం, రైల్వే ఆస్తులు ధ్వం సం చేయడం చట్ట ప్రకారం నేరమని రైల్వే సిఐ జి.తిరుపతిరావు అన్నారు. స్థానిక రైల్వే పోలీసు స్టేషన్‌ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సి ఐ జి.తిరుపతిరావు మాట్లాడుతూ నరస రావుపేట ఆర్‌.పి.ఎఫ్‌ సర్కిల్‌ పరిధి నుదురుపాడు - కంభం రైల్వే స్టేషన్ల పరిధిలో అనవసరంగా రైలు అలారం చైన్‌ లాగడం, రైళ్లపై రాళ్లు రువ్వడం వంటి పనులు చేయ డం వలన జరిగే పరిణామాలపై మాట్లా డారు. గడచిన 9 నెలల కాలంలో 35 చైన్లు లాగిన కేసులు, రైలులో, స్టేషన్‌ పరిసర ప్రాంతాలలో ధూమ, మద్యపానం 468 కేసులు నమోదైనట్లు చెప్పారు.సరైన పర్యవేక్షణ లేకపోవ డం వల్ల పశువులను రైలు పట్టాలపై వదలడం వలన జరిగిన సం ఘటనపై 10 కేసులు నమో దైనట్లు చెప్పారు. రైలు ప్రమాదాల నివారణకు ప్రజ లు, ప్రయాణికులు అప్రమత్తతో వ్వవహరించాలన్నారు. ఎఎస్‌ఐ సుభాని, హెడ్‌కానిస్టేబుల్‌ ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.