ప్రజాశక్తి - రేపల్లె
ఇసుక అక్రమ మైనింగ్ను అరికట్టటంలో అధికారులు విఫలమయ్యారని జై గౌడ్ బహుజన సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బొర్రా శ్రీనివాసరావు ఆరోపించారు. మండలంలోని పెనుమూడి కృష్ణ నది సమీపంలో అక్రమ మైనింగ్ జరుగున్న ప్రాంతాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక రీచ్‌లకు అనుమతులు లేకుండా అక్రమార్జులు రీచ్‌లను ఆక్రమించి, అక్రమార్జనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పెనుమూడి, భట్టిప్రోలు మండలం ఓలేరు సమీపంలోని కృష్ణా నదిలో కొంతమంది పేత్తందారులు ఇసుక తవ్వకాలు చేస్తున్నా అధికారులు దృష్టిపెట్టకపోవడం ఏమిటని ప్రశ్నించారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు అనుమతులు ఇవ్వాలని సుప్రీమ్ కోర్టు ఉత్తర్వులు ఉన్నా అక్రమ మైనింగు పాల్పడుతున్న వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోవటంలేదని అన్నారు. పడవల ద్వారా నదీలోనికి వెళ్ళి బక్కెట్లతె ఇసుక తోడుకుని వచ్చే కూలీలకు ఒక ట్రాక్టర్ ఇసుక లోడ్ చేసినందుకు రూ. 800 కూలీ ఇస్తున్నారని, నది గట్టుపైన కూర్చోని ప్రతినిధులు ట్రాక్టరు రూ.2200వసూలు చేస్తున్నారుని తెలిపారు. ఇదే ఇనుకను రేపల్లెలో రూ. 4500కు విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. సామాన్యులు ఎవరైన ఒక ట్రక్కు ఇసుక తీసుకుంటే కేసులు కట్టి వేధించే అధికారులు ఇసుక అక్రమార్కులను ఎందుకు వదిలేస్తున్నారని అన్నారు.










