Oct 10,2023 00:05

అనుమతుల్లేని మైనింగ్‌ను అడ్డుకోవాలి

అనుమతుల్లేని మైనింగ్‌ను అడ్డుకోవాలి
సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ ధర్నా
ప్రజాశక్తి - గూడూరు రూరల్‌ : గూడూరు , చిల్లకూరు మండలాల్లో అనుమతులు లేకుండా జరుగుతున్న అక్రమ మైనింగ్‌ తవ్వకాలను అరికట్టాలని గూడూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ వెంకట గిరి ఇన్‌చార్జ్‌ పంటా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో ఆక్రమ మైనింగ్‌ తవ్వకాలు విపరీతంగా సాగు తున్నా యని అధికారులకు తెలిపినా పట్టించు కోవ డం లేదన్నారు. పేదలు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములను దౌర్జన్యం గా తీసుకొని సిలికా, గ్రావెల్‌, తెల్లరాయి మైనింగ్‌ తవ్వకాలు నిర్వహిస్తున్నారని వీటిపై ఉన్నత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు .ఈ కార్యక్రమంలో దర్శి నాగభూషణం, పూల చంద్రశేఖర్‌, ప్రభాకర్‌ పాల్గొన్నారు.