రాయచోటి : ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అమ్మితే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరే ట్లోని స్పందన హాల్లో జిల్లా వ్యవసాయ శాఖ, విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, సీడ్స్ వ్యాపార దుకాణదారులకు, డీలర్లకు పురుగు మందులు, విత్తనాలు, ఎరువులు చట్టాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైసెన్సు లేకుండా పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రతి దుకాణదారుడు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు కొన్న రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలన్నారు. గ్రామాల్లో లూజ్ విత్తనాలు అమ్మ రాదని, ఎవరైనా అమ్మితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దుకాణదారులు ప్రభుత్వం నిర్దేశించిన ఎంఆర్‌పి ధరల ప్రకారం విక్రయించాలని సూచించారు. అధిక ధరలకు అమ్మినట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవ న్నారు. రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు ఎస్‌పి షేక్ మాసుంబాష మాట్లాడుతూ డీలర్లు చట్టాన్ని అతిక్రమించకుండా వారి వ్యాపారాలను న్యాయబ ద్ధంగా చేసుకుంటూ, నాణ్యమైన విత్తనాలను ఎరువు లను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సరైన సమ యంలో అందేలా చూడాలని, రైతుల పక్షాన నిలబడి వారి అభివద్ధికి సహకరించాలని సూచించారు. వ్యవసాయ శాఖ జిల్లా అధికారి బి.చంద్ర నాయక్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు మరియు సరైన ధర అందించేలా కషి చేయమని సూచించారు. స్టాక్ వివరాలను ఎప్పటికప్పడు సరి చేయాలన్నారు. విత్తనాలు తీసుకున్న రైతుకు బిల్లు తప్ప నిసరిగా ఇవ్వలన్నారు. కాలం చెల్లిన విత్తనాలను ఎట్టి పరిస్థితిలో అమ్మకూడదన్నారు. విత్తన చట్టం ప్రకారం అన్ని నియమనిబంధనలు పాటించాలన్నారు. సదస్సులో ఎడిఎ మజీద్ అహ్మద్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఐ జి.ఇదురుబాష, డిఎఒ ఆఫీస్‌లోని క్వాలిటీ కంట్రోల్ ఎఒ బి వెంకట మోహన్, విజిలెన్స్ ఎఒ బాలగంగాధర్‌రెడ్డి, వ్యవసాయ సహాయ సంచాలకులు, జిల్లాలోని డీలర్లు పాల్గొన్నారు.










