ప్రజాశక్తి-వేటపాలెం: వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామంలో పత్తిపాటి సుబ్బారావు నివాసం వద్ద మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ మీరు శాసనసభ్యుడిగా పని చేసిన సమయంలోనే పందిళ్లపల్లి గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని అన్నారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కుల మతాలకు అతీతంగా చీరాల నియోజకవర్గం ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేదని వారు అన్నారు రానున్న ఎన్నికలలో మేమందరం మీ వెంటే నడుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కీర్తి వెంకట్రావు, మసనం శీను, ఆవుల రామారావు, పయ్యల కోటేశ్వరరావు, కీర్తి చిన్న, కీర్తి బ్రహ్మయ్య, పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.










