Aug 05,2023 20:41

అనుచితం

భిన్నాభిప్రాయాలు, నిరసనలు ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లు. ఇటువంటి ఉత్తమ విలువలకు భిన్నంగా ఇటీవల రాష్ట్రంలోని పులివెందుల, పుంగనూరు నియోజకవర్గ కేంద్రాల్లో అధికార పార్టీ వ్యవహరించడం ఆందోళకరం. పాలక పార్టీలు ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ వైఖరుల్ని బలప్ర యోగం ద్వారా అడ్డుకోవాలని చూడడం విస్మయకరం. దేశంలో, రాష్ట్రంలోనూ పాలక పార్టీలు అధికా రాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకత్వాలపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడడం ప్రజా స్వామ్య విలువల్ని పాతాళానికి తొక్కేయడమేనని చెప్పవచ్చు. దేశంలోని రాజకీయ పార్టీలు ఏదైనా ఒక అంశంపై భిన్నాభిప్రాయాల్ని వెల్లడించొచ్చు. ఇటువంటి విలక్షణ వ్యవస్థలో పాలకపక్షాలు ఆయా ప్రతిపక్ష పార్టీలు తమ ఆలోచనలకు అనుగుణంగా స్పందించడం లేదనే ఉద్దేశంతో అసహనానికి గురి కావడం తగదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీల భిన్నాప్రాయాల్ని, నిరసనల్ని సహించలేక పోవడం నియంతృత్వానికి సంకేతం. ఇటువంటి సంకేతాలు ప్రజా స్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటివని గుర్తించాల్సి ఉంది. అధికారంలో ఉన్న పాలక నాయకత్వం, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు చేసే విమర్శల్ని హుందాగా స్వీకరించాలి. అందులోని వాస్తవాలను అర్థం చేసుకుని తప్పులు దొర్లి ఉంటే సరిదిద్దుకో వడా నికి భిన్నాభిప్రాయాలు, నిరసనలు ఉపయోగపడతాయని గ్రహి ంచా లి. ప్రస్తుత పాలక పార్టీ భవిష్యత్‌లో ప్రతిపక్ష పార్టీగా మారే అవకాశాలు ఉన్నాయి. బండ్లు, ఓడలు, ఓడలు బళ్లు అవుతాయన్న సామె తను మరిచి చిత్తానికి తోచినట్లు ఇష్టానుసారంగా ప్రవర్తించడం తగదు. అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షాల విమర్శల్ని సహించ లేక పోవడం, ప్రతిపక్ష పార్టీ నాయకత్వాలపై రాళ్లదాడులు, దౌర్జన్యా లకు పాల్పడడం విలువల పతనానికి సంకేతం. ఇటువంటి సహించ లేని పాలక పార్టీలు కాలగమనంలో కలిసిపోతాయని గమనించాల్సి ఉంది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే సత్యాన్ని గుర్తించి, అధి కార, ప్రతిపక్ష పార్టీలు తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించాల్సి ఉంటుంది.పాలక, ప్రతిపక్ష పార్టీలు దిగజారిన పదజాలాన్ని ప్రయో గించడం అభ్యంతరకరం. సమాజం ఉత్తమ, మధ్యమ, అథమ శ్రేణులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఉత్తమ కేటగిరీలోని మేధావులు, ఉత్తములు దిగజారిన పదజాల ప్రయోగాల్ని అసహ్యించుకుం టున్నారనే స్ఫృహ లేకుండా మాట్లాడడం విస్మయాన్ని కలిగిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి దేశంలోని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రొఫెషనలిస్టుల ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీల నిర్వహణ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించ డానికి ఎన్నికల ప్రొఫెషనషలిస్టుల సహకారంతో వెళ్తున్నట్లుగా ప్రజా స్వామ్య విలువల్ని ఒంట బట్టించుకోవడానికి సైక్రియాటిక్‌, ఫిలాం త్రోఫిక్‌ ప్రొఫెషలిస్టులను నియమిం చుకోవాల్సిన పరిస్థితులు దగ్గర లోనే ఉన్నాయనే విమర్శ పెద్దఎత్తున వినిపి స్తోంది. ఇప్పటికైనా దేశం లోని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య విలువల పరిరక్ష ణకు ప్రాధా న్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనడంలో సందేహం లేదు.
- ప్రజాశక్తి - కడప ప్రతినిధి