Oct 02,2023 23:35

అను కాలేజీలో పారామెడికల్‌ కోర్సులకు ఉపాధి అవకాశాలు మెండు

అను కాలేజీలో పారామెడికల్‌ కోర్సులకు
ఉపాధి అవకాశాలు మెండు
కళాశాల చైర్మన్‌ మురళీమోహన్‌ యాదవ్‌

ప్రజాశక్తి - క్యాంపస్‌ : స్థానిక తిరుపతిలోని అను ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ పారామెడికల్‌ సైన్స్‌ కాలేజీలో వివిధ విభాగాలలో పారామెడికల్‌ కోర్సులు ఉన్నాయని ఈ కోర్సుల ద్వారా విద్యార్థులకు సత్వరమే ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని అను ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ పారామెడికల్‌ సైన్స్‌ కళాశాల చైర్మన్‌, డైరెక్టర్‌ డాక్టర్‌ మురళీమోహన్‌ యాదవ్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005 సంవత్సరంలో తిరుపతిలో పారామెడికల్‌ రంగంలో అను పారా మెడికల్‌ సైన్స్‌ కళాశాలను స్థాపించడం జరిగిందని, దీని ద్వారా ఎంతో మంది నిరుద్యోగులైన వేలాది మంది నిరుద్యోగులకు శానిటరీ ఇన్స్పెక్టర్‌, హెల్త్‌అసిస్టెంట్‌, డిఎంఎల్‌ టి,డిఆర్జిఏ, డిఓఏ, డిఏఎన్‌, ఎస్డిసిటి, ఆర్‌సిటి కోర్సులు ఇచ్చి ఎంతోమంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల స్థిరపడే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. విద్యార్థులకు అతి తక్కువ సమయంలో కూర్చున్న పూర్తిచేసి ఉపాధి అందించే కోర్సులు ఏవైనా ఉన్నాయంటే పారామెడికల్‌ కోర్స్‌ లేనని వెల్లడించారు. రెండు సంవత్సరాల కాలవ్యవధిలో డిప్లమా కోర్సులు చేయడం ద్వారా విద్యార్థులకు పారా మెడికల్‌ రంగంలో ఎంతో పరిజ్ఞానం ఏర్పడి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌, మెడికల్‌ షాపులలో ఉద్యోగ అవకాశాలు పొందుతారని అన్నారు. ఈ పారామెడికల్‌ కోర్సులో చేరిన ప్రతి విద్యార్థికి 100 శాతం అవకాశాలు చూపిస్తామని చెప్పారు. ఉన్నత విద్య కోసం దేశ,విదేశాలలో కూడా చదువుకునేందుకు ఇదొక సువర్ణ అవకాశంగా వెల్లడించారు. పారా మెడికల్‌ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు గవర్నమెంట్‌ హాస్పిటల్‌లో, ల్యాబ్స్‌లో, ప్రైవేట్‌ ల్యాబ్‌లలో, పబ్లిక్‌ హెల్త్‌డిపార్ట్మెంట్లోనూ, ఎమర్జెన్సీ వైద్యరంగంలోనూ, వైద్య కేంద్రాలలోనూ, ప్రైవేట్‌ ల్యాబ్‌లలో, రక్త కేంద్రాలుు, రీసెర్చ్‌ ఇన్స్టిట్యూట్లలో, ఫార్మాసిటికల్‌ కంపెనీలలో, మెడికల్‌ ఎక్విప్మెంట్‌ తయారీ కంపెనీలలో, స్కానింగ్‌ సెంటర్స్‌లో, ఇతర వైద్యరంగానికి సంబంధించిన సంస్థలలో ఉద్యోగాలు పొందేందుకు అత్యధికంగా అవకాశం ఉందన్నారు. కళాశాలలో అత్యంత అనుభవం కలిగిన ఉన్నతమైన డిగ్రీలు కలిగిన డాక్టరేట్ల కలిగిన అధ్యాపకులతో విద్యాబోధన చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణంలో తరగతి గదిలలో పారామెడికల్‌ కోర్సులను విద్యను అందిస్తున్నామన్నారు. ఈకోర్సు విద్యార్థులు చేయడం ద్వారా 100 శాతం జాబ్‌ గ్యారంటీ ఇస్తున్నామని, బెంగళూరు, చెన్నై, స్థానికంగా ఉన్నటువంటి తిరుపతిలోని వివిధ వైద్య రంగానికి చెందిన సంస్థల ద్వారా ప్రతి ఏటా క్యాంపస్‌ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో ప్రతివిద్యార్థి కచ్చితంగా సెలెక్ట్‌ అయ్యే నైపుణ్యాలను, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను, సబ్జెక్టును పూర్తిగా నేర్పించడం జరుగుతుందన్నారు. తిరుపతిలో పారా మెడికల్‌ కోర్స్‌ రంగంలో అతి తక్కువ కోర్సు ఫీజుతో నిరుపేద విద్యార్థులకు అన్ని రకాలైన సౌకర్యవంతంగా హాస్టల్‌ గదులతో పాటు కళాశాలలో నాణ్యమైన విద్యను బోధిస్తున్న ఏకైక సంస్థ అను పారామెడికల్‌ కళాశాల అని అన్నారు. ఇతర వివరాలకు 0877- 2239569, 74164 78392, 74164 78395 నంబర్లను సంప్రదించాలని కోరారు.