Jul 06,2023 00:16

నినాదాలు చేస్తున్న పోలవరం గ్రామస్తులు

ప్రజాశక్తి-విఆర్‌.పురం
మండలంలోని అన్నవరం గ్రామాన్ని పోలవరం మొదటి జాబితాలో చేర్చాలని కోరుతూ ఆ గ్రామస్తులు బుధవారం స్థానిక తహశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమ గ్రామాన్ని మొదటి జాబితాలో చేర్చి పునరావాసం ప్యాకేజీ ఇవ్వాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వీరికి సిపిఎం నాయకులు, రేఖపల్లి సర్పంచ్‌ పూనెం సరోజినీ, టిడిపి నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ రవ్వా రామయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో8 సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, సిపిఎం, టిడిపి నాయకులు బుర్కా కన్నారావు, ప్రకాష్‌ రావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ముకునూరును పోలవరం ముంపు జాబితాలో చేర్చాలి
ప్రజాశక్తి-చింతూరు : మండలంలోని ముకునూరు గ్రామాన్ని పోలవరం ముంపు జాబితాలో చేర్చి తక్షణం పరిహారం చెల్లించాలని సిపిఎం మండల కార్యదర్శి సీసం సురేష్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం జరిగిన సిపిఎం మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలోనాయన మాట్లాడుతూ పోలవరం ముంపు జాబితాలో మండలంలో మొదట నోటిఫికేషన్‌ ఇచ్చి రైతుల భూమికి పరిహారాన్ని 2009లో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి రూ.1.15 లక్షలు ఇచ్చారని, నేటికీ 12 ఏళ్లుగా గ్రామాన్ని ముంపు జాబితాలో చేర్చలేదని తెలిపారు. ప్రతి ఏటా వరదలు ముంపులకు ముకునూరు గ్రామం అంతా ముగినిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు ముకునూరు గ్రామం పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ముకునూరును మొదటి కాంటూర్‌ గ్రామంగా గుర్తించడంతో పాటు గ్రామం మొత్తం ఉన్న కుటుంబాలకు పరిహారం చెల్లించే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 1986, 2022 వరదలకు ప్రామాణికంగా తీసుకొని ముంపు గ్రామాలను గుర్తించి పరిహారం, పునరావాసం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, కారం నగేష్‌, బడిశా శేషు, మడకం రాంప్రసాద్‌, సోదే సింగమ్మ, వెట్టి రాజు, తదితరులు పాల్గొన్నారు.