అన్నమాచార్యలో ఓరియంటేషన్ ప్రోగ్రామ్
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)
తిరుపతి-కరకంబాడి మార్గంలోని అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ సైన్సెస్‌లో 2023-24 బీటెక్ మొదటి సంవత్సరం చేరిన 850 మంది విద్యార్థులకు కళాశాలలోని అన్నమయ్య ఆడిటోరియంలో బుధవారం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐజర్ తిరుపతి డీన్ ఆర్ అండ్ డి రిజిస్టర్ ప్రొఫెసర్ విజయ మోహన్ పిళ్ళై హాజరై విద్యార్థులు తమ జీవిత లక్ష్యాలను చేరుకోవాలంటే ఎటువంటి పద్ధతులను అనుసరించాలని అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ ప్రోగ్రాం అధిపతులు డాక్టర్ రమ్య, ఐక్యూఏసీ కోఆర్డినేటర్, ఆర్ అండ్ డి కోఆర్డినేటర్ డాక్టర్ గురుజవహర్ పాల్గొన్నారు.
విజయ మోహన్ పిళ్లైని సత్కరిస్తున్న ప్రిన్సిపాల్ నాదముని రెడ్డి










