తాడేపల్లి రూరల్: ఎం టి ఎం సి పరిధిలోని మెల్లంపూడి ఎస్టీ కాలనీకి చెం దిన లక్ష్మీబాయి అనే వికలాంగు రాలకు ప్రభుత్వం ఇచ్చే పిం ఛన్ అందని ద్రాక్షలా మారింది. అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నా కూడా అది కారులు తనని నిర్ల క్ష్యం చేశారంటూ సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి దొంతిరెడ్డి వెంకటరెడ్డి ఎదుట ఆమె ఆవేదన చెందింది. ఆదివారం ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గ్రామంలోని ఎస్టీ కాలనీకి వెళ్లిన వెంకట రెడ్డికి, లక్ష్మీబాయి తనకు పింఛన్ రావడంలేదని, రెండు చేతులు పని చేసుకునేందుకు సహకరించమని చెప్పింది. తమకు పింఛన్ ఇప్పించాలని కోరింది. ఈ సందర్భంగా వెం కటరెడ్డి మాట్లాడుతూ అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నా కూడా నిరాశ్రయు రాలైన మహిళకు పింఛను ఇవ్వకపోవడం అన్యా యమని ఆయన అన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, లక్ష్మీ బాయికి పింఛను ఇవ్వాలని కోరారు.










