
ప్రజాశక్తి-శింగరాయకొండ: శింగరాయకొండ మండలంలోని వైసిపిలో ఉన్న అన్ని వర్గాలు కలిసి పనిచేసి పార్టీ అభివృద్ధితో పాటు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆశయాలను నెరవేర్చాలని కొండపి వైసిపి ఇన్‌ఛార్జి వరికూటి అశోక్‌బాబు అన్నారు. గురువారం రాత్రి శింగరాయకొండ వైసిపి కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు, వైస్ ఎంపీపీ సామంతుల రవికుమార్‌రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌కు జగన్ ఎందుకు కావాలంటే అనే కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరికూటి అశోక్‌బాబు మాట్లాడుతూ పార్టీలో వర్గ విభేదాలు సహజమని, అవన్నీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆశయాల కోసం ప్రతి ఒక్క కార్యకర్తా పనిచేయాలన్నారు. కొందరు వైసీపీలోనే నాయకులు పనిగట్టుకొని మరి అశోక్‌బాబుకు సీటు రాదని ప్రచారాలు చేస్తున్నారని, కానీ అశోక్‌బాబుకు సీటు అనేది ప్రస్తుతం అంత ముఖ్యం కాదని కొండేపి నియోజకవర్గంలో పార్టీ చాలా ముఖ్యమని, దాని కోసం కార్యకర్తలందరూ పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్ని కులాలకు న్యాయం చేసేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సామంతుల రవికుమార్‌రెడ్డి చింతపల్లి హరిబాబు, యన్నాబత్తిన వెంకటేశ్వరరావు, యనమల మాధవి, ఎస్‌కె సలీం బాషా, ఎస్‌కే పటేల్, పాకనాటి సుబ్బారెడ్డి, పీవీ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు.