Oct 24,2023 22:08

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు ఉండేలా దృష్టి సారించాలని పలువురు వైద్యులు సూచించారు. నగరంలోని దానవాయిపేటలో గంగా ఎమర్జెన్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌ (జెమ్స్‌)ను జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజీ ఛైర్మన్‌ డాక్టర్‌ గన్ని భాస్కరరావు ప్రారంభించారు. ఫ్యామిలీ ఫిజిషియన్‌ డాక్టర్‌ పిల్లాడి ఎస్‌విటిఆర్‌కె.పరమహంస తనయుడు డాక్టర్‌ పిల్లాడి వివేకానంద చైతన్య, కోడలు ఎస్‌.కమల సారధ్యంలో హాస్పటల్‌ ఏర్పాటు అయ్యింది. ఈ సందర్భంగా మెడికల్‌ ఐసియు విభాగాన్ని కోయంబత్తూరు కెజి.హాస్పటల్‌ చీఫ్‌ అనస్థీషియాలజిస్టు డాక్టర్‌ ఆర్‌.సెంథిల్‌ కుమార్‌ ప్రారంభించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను నగరంలోని ప్రముఖ వైద్యులు కంటే దుర్గ, ఎన్‌.రామరాజు, బి.వెంకటరాజు, ఎ.శ్రీనివాసులు, సి.హెచ్‌.ఎం.గుప్తా, వై.ఎస్‌.గురుప్రసాద్‌, టి.వి.నారాయణరావు, కె.వి.చౌదరి, ఆర్‌ఎస్‌.చలం, దాట్ల భాస్కరరాజు, కందుల సాయి, పిడుగు విజయభాస్కర్‌, కె.విజయకుమార్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ అరవింద్‌, డాక్టర్‌ భాస్కర్‌ చౌదరి, డాక్టర్‌ గంగా కిషోర్‌, డాక్టర్‌ కర్రి రామారెడ్డి, డాక్టర్‌ రమేష్‌ కిషోర్‌, డాక్టర్‌ సతీష్‌, డాక్టర్‌ నేమాని సత్యనారాయణ, డాక్టర్‌ జి.వీరభద్రస్వామి, డాక్టర్‌ విశేష్‌ కుమార్‌ పాల్గొన్నారు. కార్యక్రమంలో నగర ప్రముఖులు చక్కా త్రినాథ్‌, రెడ్డి రాజు, ఆనంద్‌ కుమార్‌ జైన్‌, పిల్లాడి రుద్రయ్య, ఆసుపత్రి వైద్య బందం డాక్టర్‌ బి.స్పందన, డాక్టర్‌ బోడా రవికిరణ్‌, డాక్టర్‌ పిఆర్‌ఎస్‌.తులసి, డాక్టర్‌ కొల్లా వెంకటేష్‌, డాక్టర్‌ రమ్యకృష్ణ, పివిఎస్‌.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.