ప్రజాశక్తి-నర్సీపట్నం రూరల్: మున్సిపాలిటీలోని 16, 21 వార్డుల్లో బుధవారం మున్సిపల్ చైర్ పర్శన్ గుడబండి ఆదిలక్ష్మీ సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. ముందుగా 16వ వార్డు శారదానగర్లో సుమారు రూ.7.50 లక్షలతో చేపట్టనున్న సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం 21వ వార్డు శ్రీరామ్మూర్తి వీధిలో సుమారు రూ.10లక్షలతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్శన్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఉమా శంకరగణేష్ సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామన్నారు. అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో 16వ వార్డు కౌన్సిలర్ వీరమాచినేని జగదీశ్వరి, 21వ వార్డు కౌన్సిలర్ వినీల చైతన్య, వైసిపి పట్టణ అధ్యక్షులు ఏకా శివ, అయ్యరక కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావు, వైసిపి నాయకులు, మున్సిపల్ సిబ్బంది. పాల్గొన్నారు.










