Jun 27,2023 21:23

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ. గఫూర్‌

బద్వేలు : రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి వెనుకబడిపోయిందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాటా ్లడుతూ తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాలలో వెనుకబడి ఉందని తెలి పారు. కేంద్రంలోని బిజెపి రాష్ట్ర విభజన హామీలలోని ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, కడప ఉక్కు పరిశ్రమ, పోలవరం ప్రాజెక్టు లాంటివి ఏ ఒక్కటి కూడా పూర్తి చేయల ేదన్నారు. అలాంటి బిజెపికి రాష్ట్రంలోని టిడిపి, వైసిపి, జనసేన మద్దతుగా నిలబడడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మూడు పార్టీలు సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాభివృద్ధిని తాకట్టు పెట్టాయని పేర్కొన్నారు. బిజెపి అంటే బాబు, జగన్‌, పవన్‌ అని అర్థం వచ్చేలా బిజెపి విధానాలకు వంత పాడుతున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను గాలి కొదిలేసారని, భవిష్యత్‌ తరాలు వీరిని క్షమించవని పేర్కొన్నారు. రాబోయే కాలంలో విభజన హామీలను అమలు చేసుకునేందుకు సిపిఎం ఆధ్వర్యంలో సమావేశాలు పోరాటాలు, ఉద్యమాలు చేస్తామని తెలిపారు. దేశ ప్రజలలో ఐక్యతను దెబ్బతీసేలా బిజెపి నాయకుల మాటలు, పరిపాలన తీరు ఉన్నాయని తెలిపారు. ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తులో బిజెపి తన ప్రతిష్టను క్రమక్రమంగా కోల్పోయి దేశంలో అధికారం కోల్పోతుందని జోష్యం చెప్పారు. మైనార్టీలను, క్రైస్తవులను వ్యతిరేకిస్తూ పోతే బిజెపి కర్ణాటక రాష్ట్రంలో ఓడిపో యినట్లుగానే ఇతర రాష్ట్రాలలో కూడా ఓడిపోతుందన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు ఐఎన్‌.సుబ్బమ్మ, సిఐటియు నాయకులు శ్రీనివాసులు, నాగేంద్ర, సిపిఎం నాయకులు దస్తగిరి, రామ్మోహన్‌, శివకుమార్‌, మనోహర్‌ పాల్గొన్నారు.