Aug 31,2023 23:28

శ్రీకాకుళం అర్బన్‌ : ప్రచారం చేస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల ను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యాన నిర్వహించిన ప్రచారభేరి కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంతకాల సేకరణ, పోస్టర్లను పంచుతూ ప్రచారం చేపట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలోను, నిత్యావసర ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి, నగర కన్వీనర్‌ టి.తిరుపతిరావులు విమర్శించారు. ప్రచార భేరి కార్యక్రమంలో భాగంగా నగరంలోని దమ్మలవీధిలో ప్రచారం చేపట్టి పోస్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్లకు, బడాబాబులకు రూ.లక్షల కోట్లు రాయితీలు ఇస్తూ... ప్రజలపై భారాలు వేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టి భవిష్యత్‌ తరాలకు తీరని ద్రోహం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్‌ ప్రభుత్వం ఈ విధానాలను వ్యతిరేకించకుండా మోడీకి భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అధిక ధరలు తగ్గించాలని, నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంచాలని, పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. నాలుగేళ్లలో ఏడుసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన దళితులకు, గిరిజనులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 4 వరకు నిర్వహించనున్న సమరభేరిని విజయవం తం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కె.సూరయ్య, ఎల్‌.మహేష్‌, ఎం.ఎర్రయ్య, కృష్ణ, బి.పుణ్యవతి, రామారావు, కె.ప్రభావతి, సిహెచ్‌.పోలమ్మ, కృష్ణవేణి, లక్ష్మి, రాజేశ్వరి, కుసుమ, ఎ.రాంబాబు, రత్నం పాల్గొన్నారు.
ఎచ్చెర్ల : అధిక ధరలను నియంత్రించాలని, విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 4న ఎచ్చెర్లలో ధర్నా నిర్వహిస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. కేంద్ర, రాస్త్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఎచ్చెర్ల మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యాన నిర్వహించిన సమరభేరిలో భాగంగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. సిఐటియు నాయకులు డి.బంగా ర్రాజు, ఎపిబిసిఎల్‌ హమాలిస్‌ యూనియన్‌ నాయకులు భాస్కరరావు, ఇంధన రమణ, సురేష్‌, మహేష్‌, చిరంజీవి, నాగరాజురాజశేఖర్‌ పాల్గొన్నారు.