గ్రంథాలయ ఛైర్‌పర్సన్ మధుబాల
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్
నేడు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని గ్రంథాలయ ఛైర్‌పర్సన్ మధుబాల అన్నారు. 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆదివారం భారత మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని అన్నారు. దిశ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ నాగసౌజన్య విద్యార్థులకు దిశ చట్టంను గురించి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియాలన్నారు. మహిళలు శారీరకంగా, మానసికంగా దఢంగా ఉండాలన్నారు. ఆత్మీయఅతిధిగా రోజాప్రియ మాట్లాడుతూ విద్యార్థులకు విద్య, వైద్య, ఆరోగ్య విషయాలను తెలియచేశారు. విశిష్ట అతిధి డిపిఆర్‌ఓ పద్మజ మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయంకు రావడం దినచర్యగా భావించి జ్ఞానాన్ని అభివద్ధి చేసుకోవాలి తెలియచేశారు. నవ్యాంధ్ర రచయితల అధ్యక్షులు కే.విమల మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా పుస్తక పఠనము అలవాటు చేసుకొని విజ్ఞానం పెంపొందించుకొని ముందడుగు వేయాలని తెలిపారు. నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు కే.విమల అతిధులందరినీ సన్మానించారు. జిల్లా గ్రంథాలయ స్థం కార్యదర్శి శర్మ, లలిత, మధుబాబు, గుణశేఖర్, పూర్ణిమ, తులసి కుమార్, దేవిబాల, సరస్వతి, శిరీష, లవకుమార్, రాజశేఖర్, ఎల్లమ్మ పాల్గొన్నారు.