Jul 12,2023 17:26

అధికారికి వినతి పత్రం అందిస్తున్న ఏపీ రైతు సంఘం నాయకులు

అన్ని రకాల పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి: ఏపీ రైతు సంఘం
ప్రజాశక్తి - ఆత్మకూర్

    పంటల బీమా మొక్కజొన్న వేసిన పంటలకు అన్ని రకాల పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి సుధాకర్, ఏపీ రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఎన్ వీరన్న, మండల సహాయ కార్యదర్శి కృష్ణమోహన్ నాయకులు కే రాముడు ప్రభుత్వం డిమాండ్ చేశారు బుధవారం నాడు నల్ల కాలువ రైతు భరోసా సచివాలయ అధికారికి రైతుల సమస్యలపై మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి సుధాకర్ ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి ఎన్ వీరన్న మాట్లాడుతూ 2021, 22 సంవత్సరంలో పంటల బీమా నష్టపరిహారం జిల్లాలో ప్రధానంగా మొక్కజొన్న, అన్ని రకాల పంటలకు పరిహారం ఇవ్వలేదు. అట్లాగే నల్ల కాలువ గ్రామ పొలిమేరలో సంఖ్యలో మొక్కజొన్న వేయడం జరిగింది. అయితే పంటల బీమా పరిహారం ఏ ఒక్క రైతుకు వారి బ్యాంకు ఖాతాలో ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పడలేదని వారన్నారు. కేవలం ఉల్లి, పత్తి పంటలకు 20 మంది రైతులకు మాత్రమే వచ్చాయని అధికారులు చెబుతున్నారు. రైతులు అప్పులు చేసి, పాతపులకు కొత్త అప్పులు తోడై పంటలు పండక అతివృష్టి అనావృష్టి వల్ల పంటలు దెబ్బతిని పూర్తిగా నష్టపోయారు అన్నారు. అట్లాగే జిల్లాలో ఈ నాలుగు సంవత్సరాల కాలంలో పంటలు పండక, అప్పులు తీర్చలేక 150 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలు నివారించడంలో పాలకులు ప్రభుత్వాలు విఫలమయ్యారని వారన్నారు. స్వామినాథన్ సిఫారసు కమిటీ ప్రకారం 2 ప్లస్ ఫిఫ్త్ శాతం మద్దతు ప్రకటించాలని అన్ని పంటలకు పంటల బీమా వర్తింపజేసి రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలని వారు అన్నారు. కౌలు రైతులకు భూ యజమాని సంతకం లేకుండా కౌలు కార్డులు ఇవ్వాలని వాస్తవ సావుదారులకే ఈక్రాప్ నమోదు చేయాలని వారు అన్నారు. మండలంలో సిద్దాపురం చెరువు పంట కాలువలను వెంటనే పూర్తి చేయాలని వారన్నారు. రహంతుల్లా తిమ్మయ్య బాలన్న పి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.