Sep 10,2023 21:08

అన్నదాతలను విస్మరిస్తే ఆహార సంక్షోభం తప్పదు

కడప అర్బన్‌ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందిందని, అన్నదాతలను విస్మ రిస్తే ఆహార సంక్షోభం తప్పదని ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభా కర్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం రైతు సంఘం జిల్లా కార్యాలయంలో విస్తత సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మద్దతు ధరలు గ్యారెంటీ చట్టం అమలు చేయ డంలో పాలక ప్రభుత్వాలు విఫలం చెందా యని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని , ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా కేంద్ర మోడీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగించిందని విమర్శించారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం సి2ః50 శాతం ఫార్ములాకు అనుగుణంగా అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేరళ తరహాలో రుణ విమోచన చట్టం తీసు కువచ్చి రైతులను ఆదుకుని ఆత్మ హత్యలను నివారించాలని కోరారు. కేంద్ర విద్యుత్‌ సవరణ బిల్లు నుంచి వ్యవ సాయాన్ని మినహాయించి వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే విధానానికి స్వస్తి పలకాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌ విధానాల వల్ల రైతులకు రక్షణ లేకుండా పోయిందని, వ్యవసాయం నిలవాలంటే రైతులను కాపా డాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయాన్ని అన్నదాతలను ప్రభుత్వాలు విస్మరిస్తే దేశంలో ఆహార సంక్షోభం తప్పదని హెచ్చ రించారు. కరువు రైతాంగ సమస్యలపై ఈ నెల 10 నుంచి 20 వరకు గ్రామాల పర్యటనలు నిర్వహిస్తున్నట్లు అక్కడ వచ్చిన సమస్యలపై సచివాలయల్లో కేంద్రాలలో వినతి పత్రం ఇవ్వాలని రైతు సంఘం నాయకులకు తెలిపారు. అనంతరం ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విస్తత సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోపాలకష్ణయ్య, దస్తగిరి రెడ్డి, అన్నమయ్య జిల్లా రైతు సంఘం నాయకుడు నాగబసిరెడ్డి, జిల్లా నాయకులు వెంకటసుబ్బయ్య, శ్రీనివా సులరెడ్డి, చిన్న సిద్దయ్య, రంగారెడ్డి, రామచంద్రారెడ్డి, పుల్లయ్య పాల్గొన్నారు.