ప్రజాశక్తి - వేపాడ : అన్నదాతల కష్టాలు తెలిసిన పాలకులు వైసిపిలో ఎక్కడున్నారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ, జనసేన నియోజకవర్గం నాయకులు ఒబ్బిన సత్యనారాయణ అన్నారు. జనసేన, టిడిపి సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు మండలంలో ఆదివారం రైతు గర్జన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా వర్షాభావం వల్ల నష్టపోయిన వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పంట పొలాలకు సాగునీరు అందించలేని ఇటువంటి ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించాలన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కరువు మండలంగా గుర్తించి నష్టపరిహారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాలకు చెందిన టిడిపి నాయకులు గొరపల్లి రాము, గొంప వెంకటరావు, గుమ్మడ భారతి, జనసేన నాయకులు గొరపల్లి రవి, సుంకరి అప్పారావు, కొట్టియాడా రామకోటి, షేక్ ఫిరోజ్, ఒబ్బిన సన్యాసినాయుడు,జనసేన, టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నెల్లిమర్ల: ఉమ్మడి విజయనగరం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని టిడిపి, జనసేన సంయుక్త జిల్లా కో ఆర్డినేటర్ లోకం మాధవి డిమాండ్ చేశారు. ఆదివారం జనసేన ఆధ్వర్యంలో రైతు గర్జన కార్యక్రమంలో భాగంగా రైతులతో మాల్యాడ నుంచి ఒమ్మి మీదుగా సతివాడ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ జిల్లాలో వర్షాభావ పరిస్థితుల్లో కరువు ఛాయలు అలుముకున్నాయని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కరువు పై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. జిల్లాలో ఉన్న తోటపల్లి కాలువ నుంచి నీరు వదలడం మీద దృష్టి పెట్టి ఉంటే కొన్ని ప్రాంతాల్లోనైనా పంటలు ఎండిపోయేవి కాదన్నారు. కరువు వల్ల నష్టపోయిన ప్రతీ ఎకరాకు రూ25వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.
తెర్లాం: మండలంలోని సోమదివలసలో జనసేన ఆధ్వర్యంలో ఆదివారం 'రైతు గర్జన' కార్యక్రమాన్ని నిర్వహించారు. వరి పంటకు సకాలంలో సాగునీరు అందకపోవడంతో దాదాపు 100 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని బొబ్బిలి జనసేన నియోజకవర్గం ఇంచార్జి గిరాడ అప్పలస్వామి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహన కార్యదర్శి బాబు పాలూరు తెలిపారు. ఈ సందర్బంగా వరి పంటను జనసేన నాయకులతో కలిసి టిడిపి మండల అధ్యక్షలు వెంకటనాయుడు, మాజీ ఎంపిపి నర్సుపల్లి వెంకటేష్ పరిశీలించారు. బాబు పాలూరు పట్లాడుతూ బొబ్బిలి నియోజకవర్గంలో నాలుగు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బొబ్బిలి ఎమ్మెల్యేకి కనీసం చిత్తశుద్ధి ఉంటే రైతులకు తక్షణమే న్యాయం చేయాలన్నారు. గిరాడ అప్పలస్వామి మాట్లాడుతూ రాష్ట్రాన్ని జగన్ నియంతలా పాలిస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు మరడాన రవి, జనసేన నాయకులు చందక ఉమామహేష్, బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, రామభద్రపురం మండల అధ్యక్షులు భవిరెడ్డి మహేష్, జనసేన సీనియర్ నాయకులు లంకా రమేష్, అడబాలు నాగు, పళ్లెం రాజా, చీమల సతీష్, కనకల శ్యాం, మహంతి ధనుంజయ, రాజా జగన్, తెర్లం మండల నాయకులు బూరి రామకృష్ణ, రాజు, అబోతుల రాజు, పాండ్రంగి అప్పారావు, ఎందువా సత్యన్నారాయణ, వీర మహిళలు యామిని, రమ్య, వరలక్ష్మి, గోపి, సాయి, నవీన్, శ్రీను, సింబు, శివ, మండల శ్రీకాంత్, జన్నివలస నవీన్, రామ్ లక్ష్మణ్, రఘు, రమేష్, పెరుమాలి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం టౌన్: వర్షాభావం వల్ల ఈ ఏడాది రైతులు ఆర్థికంగా నష్టపోయారని, తక్షణమే వారిని ప్రభుత్వం ఆదుకోవాలని టిడిపి, జనసేన నాయకులు డిమాండ్ చేశారు. రైతుగర్జన కార్యక్రమంలో భాగంగా కోరుకొండ గ్రామంలో ఎండిపోయిన వరిపంటను ఆదివారం జనసేన, టిడిపి నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ రైతుల సమస్యలు తెలుసుకున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, పంట ఎండిపోవడంతో తీవ్రంగా నష్టతున్నాయని వాపోయారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తీవ్ర కరువు పరిస్థితుల్లో రైతాంగం ఉంటే... వారి సమస్యలపై కేబినెట్ సమావేశంలో కనీసం చర్చించకపోవడం జగన్ ప్రభుత్వానికి అన్నదాతల సమస్యల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికించడంపై ఉన్న శ్రద్ధ కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడంపై లేదన్నారు. కరువు మండలాలకు సంబంధించి కలెక్టర్లు.. రాష్ట్రంలో 470 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని నివేదిక ఇస్తే.. ప్రభుత్వం కేవలం 103 మండలాలు మొక్కుబడిగా ప్రకటించడం రైతుల్ని వంచించడం కాదా? అని ప్రశ్నించారు. జిల్లాలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఐవిపిరాజు, బొద్దల నర్సింగరావు, గంట పోలినాయుడు, వేచలపు శ్రీను, రాజేష్‌బాబు, జనసేన నాయకులు గురాన అయ్యలు, కాటం అశ్విని, ఎం.గాయత్రి తదితరులు పాల్గొన్నారు.