Oct 11,2023 23:53

అన్నదాతకు వెన్నుదన్నుగా ఆర్‌బికెలు

అన్నదాతకు వెన్నుదన్నుగా ఆర్‌బికెలు

ప్రజాశక్తి-నగరి: అన్నదాతకు వెన్నుదన్నుగా రైతుభరోసా కేంద్రాలు నిలుస్తున్నాయని మంత్రి ఆర్కేరోజా అన్నారు. బుధవారం మండలంలోని ఓజీ కుప్పం గ్రామంలో రూ.22లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ విత్తు నుంచి విక్రయం దాకా ఒకేచోట అందించాలన్నదే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతుకు కావలసిన సేవలన్ని చేరువయ్యాయన్నారు. భీమా, పంట నమోదు, హార్టికల్చర్‌, ప్రకతి వ్యసాయ పద్దతులపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్ధేశ్యం అన్నారు. గతంలా విత్తనాల కోసం పడిగాపులు, ఎరువుల కోసం ఆందోళనలు ఇప్పుడు లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భార్గవి, వైస్‌ఎంపీపీలు కన్నియప్ప, డిల్లి, కోఆప్షన్‌ సభ్యులు దస్తగిరి, ఎంపీడీవో లీలామాధవి, వ్యవసాయ అధికారి రాఘవేంద్ర యాదవ్‌, ఆర్బీకే చైర్మన్‌ బుజ్జిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ తిరుమలరెడ్డి, మండల సచివా లయ కన్వీనర్‌ హరి, సర్పంచ్‌లు నాయకులు పాల్గొన్నారు.