Jun 04,2023 23:42

ఎస్‌.రాయవరంలో ఏరువాక చేపడుతున్న నాయకులు

ప్రజాశక్తి - కశింకోట
రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేయడమే టీడీపీ లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. మండలంలోని తాళ్ళపాలెంలో టిడిపి ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణిమి ఆదివారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దుక్కు దున్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు పడి పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలనే ఏరువాక పౌర్ణమి కార్యాక్రమం చేస్తున్నామన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే అన్నదాత పథకం ద్వారా ఏడాదికి రూ.20వేలు రైతులకు ఇస్తామన్నారు. వైసిపి ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కాయలు మురళి, ఉగ్గిన రమణ మూర్తి, మజ్జి నిరంజన్‌ కుమార్‌, గొంతుని శ్రీనివాసరావు, ఎంపీటీసీ బుద్దిరెడ్డి అప్పడు, నైనంశెట్టి రమణారావు, మనసాల నానాజీ, ఆనాల తాతిల నాయుడు, జెర్రిపొతల నూకి నాయుడు, కర్రి దుర్గి నాయుడు, తీర్రి చిరంజీవి, కోన రమణ, ఉల్లింగల రమేష్‌, గొకివాడ వెంకట అప్పారావు పాల్గొన్నారు.
ఎస్‌.రాయవరం:రాష్ట్రాన్ని అప్పులతో అంధకారంలో ముంచి వ్యవసాయాన్ని, రైతాంగాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అథోగతి పాలు చేశారని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు అమలకంటి అబద్దం విమర్శించారు. ఎరువాక పౌర్ణమి సందర్బంగా రైతులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన రైతులతో కలిసి పొలంలో నాగలి పట్టారు. అనంతరం మాట్లాడుతూ, తెలుగుదేశంతోనే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించకుండా రైతులను దగా చేశారని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, వ్యవసాయానికి, రైతులకు మంచి రోజులు రావాలన్నా మళ్ళీ తెదేపా అధికారంలోకి రావాలని ఆవశ్యకత ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.