అన్నా క్యాంటీన్ వద్ద సెల్పీ ఛాలెంజ్ విసురుతున్న కోరాడ రాజబాబు
ప్రజాశక్తి -తగరపువలస : టిడిపి హయాంలో స్థానిక పెట్రోల్ బంక్ ఎదురుగా ఏర్పాటుచేసిన అన్నా కేంటీన్‌ను తెరిపించాలని ఆ పార్టీ భీమిలి నియోజక వర్గ ఇంఛార్జి కోరాడ రాజబాబు వైసిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చిట్టి వలస జ్యూట్ మిల్లు తెరిపించాలి
మూతపడిన చిట్టివలస జ్యూట్ మిల్లును తెరిపించాలని రాజబాబు కోరారు. అధికారంలోకి వచ్చాక మిల్లు తిప్పుతామని కార్మికులకు ఇచ్చిన హామీని స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు నిలబెట్టుకోలేదని విమర్శించారు. మిల్లు ప్రధాన గేట్ వద్ద ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గంటా నూకరాజు, డిఎఎన్.రాజు, పాసి త్రినాధ్‌కుమార్, టి.సూరిబాబు, ఎంవి.గురుమూర్తి, డి.సిద్ధార్థవర్మ, గరే సదానంద తదితరులు పాల్గొన్నారు.










