
ప్రజాశక్తి - కనిగిరి : పేదల ఆకలి తీర్చేందుకు గతంలో నిర్వహించిన అన్నా కాంటీన్‌ను బుధవారం నుంచి తిరిగి ప్రారంభించినట్లు టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. చంద్రన్న స్ఫూర్తితో జననీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో అన్న కాంటీన్‌ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం వచ్చే వారికి, పేదలు, దినసరి కూలీలలకు అన్న కాంటీన్ ఎంతగానో ఉపయోగపడిందన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించినందుకు నిరసిస్తూ అన్నకాంటీన్ ను తాత్కాలికంగా కొంతకాలం నిలిపివేసినట్లు తెలిపారు. చంద్రబాబు బెయిల్‌పై విడుదలైన సందర్భంగా తిరిగి అన్న కాంటీన్‌ను పున:ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.