Aug 21,2023 23:29
అన్నదానం చేస్తున్న దాతలు

ప్రజాశక్తి-బాపట్ల: పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్‌ వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ దాతల సహకార అభినందనీయమని నరేంద్రవర్మ అన్నారు. సోమవారం 295వ రోజు కర్లపాలెంకు చెందిన కొమ్మూరి సత్యవాణి జ్ఞాపకార్థం ఆమె భర్త మురళీకృష్ణమూర్తి కుమార్తెలు మాధవి, లత సహకారంతో నిర్వహించారు. సుమారు 350 మంది పేదలకు అన్న వితరణ చేశారు. కార్యక్రమంలో భాగస్వాములై తమ సహకారాన్ని అందించిన దాతలకు నరేంద్రవర్మ ధన్యవాదాలు తెలియజేశారు.