Mar 13,2023 01:51
అన్నా క్యాంటిన్లో అన్నదాన దృశ్యం

ప్రజాశక్తి-బాపట్ల: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల సందర్భంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు వేగేశన నరేంద్రవర్మ బాపట్లలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ 133వ రోజుకు చేరింది. తాజాగా ఆదివారం తెలుగుదేశం పార్టీకి చెందిన కీర్తి వెంకట ప్రసన్న, వెంకట ప్రవీణ పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీనారాయణ సహకారంతో దాదాపు 250 మంది పేదలకు అన్న వితరణ చేశారు. పేదల ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ నరేంద్రవర్మ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో దాతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.