Feb 22,2023 00:31
అన్న క్యాంటీన్లో అన్నం వడ్డిస్తున్న దాతలు

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ 114వ రోజుకు చేరింది. ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా పేదలకు అన్నదానం చేస్తున్న అన్న క్యాంటీన్‌కు తాజాగా మంగళవారం బాపట్ల వాసి ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న కర్పూరపు కృష్ణ కౌండిన్య పుట్టినరోజు సందర్భంగా ఆయన తండ్రి కర్పూరపు వేణుగోపాలరావు 350 మంది పేదలకు అన్నదానానికి ఆర్థిక సహాయం అందించారు. అన్న ఎన్టీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్‌ నిర్వహణలో భాగస్వాములై తమవంతు సహకారాన్ని అందిస్తున్న దాతలకు నరేంద్రవర్మ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో తానికొండ దయాబాబు, గోలపల శ్రీనివాసరావు, కర్పూరపు వేణుగోపాలరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.