ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ షేక్ షహనాజ్ సాధియా ఆధ్వర్యాన ఆనందపురంలో శనివారం ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 98 మందికి వైద్య పరీక్షలు జరిపారు. మధుమేహం, బిపి పరీక్షలు నిర్వహించారు. గర్భిణులకు ఈసీజీ పరీక్షలు చేసి మందులు అందజేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల ఇళ్లకు వెళ్లి వైద్య పరీక్షలు జరిపారు. వారు వాడుతున్న మందులు వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. నెలకు సరిపడా మందులు అందజేశారు. అంగన్‌వాడి కేంద్రాలను సందర్శించి పిల్లల ఆరోగ్యంపై ఆరాతీశారు. అనంతరం సర్పంచ్ చందక లక్ష్మి మాట్లాడుతూ, పల్లె ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కుటుంబ డాక్టర్ విధానం దోహదపడుతుందన్నారు. 14 రకాల పరీక్షలు, 67 రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి పి.సాంబమూర్తి, పంచాయతీ కార్యదర్శి గారపాటి శ్రీరామ్మూర్తి, డిపిఎమ్‌ఒ ప్రసాదరావు, సిహెచ్‌ఒ నమ్మి సాయి గౌతమి, గంట సూర్యకళ, ఆరోగ్య కార్యకర్తలు అదపాక పైడిరాజు, ఆశపు లక్ష్మీరావు, సురేంద్ర, ఆశా కార్యకర్తలు లంక పద్మ, పొట్నూరు అన్నపూర్ణ, మామిడి పద్మ, దొంతల వెంకటలక్ష్మి, పైలెట్ షేక్ కాశీమ్ తదితరులు పాల్గొన్నారు.










