Mar 30,2023 00:01

ఇగ్లూ సినిమా థియేటర్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం హైవేలో వెల్లంకి వద్దనున్న గోకార్టింగ్‌ (కార్‌ రేస్‌) ఆవరణలో విదేశాల్లో మాదిరి నిర్మించిన ఇగ్లూ సినిమా థియేటర్‌ను భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాన్యులకు అందుబాటులో వినోదం అందించేందుకు అధునాతన టెక్నాలజీతో మన ప్రాంతంలో థియేటర్‌ నిర్మించడం అభినందనీయమన్నారు. గోకార్ట్‌ యజమాని ఆనంద్‌, థియేటర్‌ యజమాని శివకృష్ణ మాట్లాడుతూ, ప్రేక్షకులకు మంచి ఎఫెక్ట్స్‌తో, అతి తక్కువ టికెట్‌ ధరలతో వినోదం అందించాలన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశామన్నారు. హీరో నాని, కీర్తి సురేష్‌ నటించిన దసరా సినిమా గురువారం నుంచి థియేటర్లో ప్రదర్శిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాపునాడు విశాఖ జిల్లా అధ్యక్షులు తోట రాజీవ్‌, భీమిలి నియోజకవర్గ వైసిపి ఇన్‌చార్జి ఎం.మహేష్‌, ఎంపీపీ మజ్జి శారద ప్రియాంక, వైస్‌ ఎంపీపీ పాండ్రంగి శ్రీను, జెడ్పీటీసీ కోరాడ వెంకటరావు, సర్పంచ్‌ ఉప్పాడ లక్ష్మణరావు, నాయకులు బంక సత్యం, కాకర వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.