ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం మండలంలో భీమిలి ఆర్‌డిఒ భాస్కర్‌రెడ్డి గురువారం పర్యటించారు. మండలంలోని పలు పంచాయతీలను సందర్శించారు. శిర్లపాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న 260 ఎకరాల అన్సెటిల్ విలేజ్ భూములను పరిశీలించారు. సర్వే ఎంతవరకు వచ్చిందని తహశీల్దార్ రామారావును వివరాలడిగి తెలుసుకున్నారు. అనంతరం సొంఠ్యాం రవిరేస్ పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని సందర్శించి వివరాలడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఈ బంకు పక్కన ఖాళీ స్థలంలో పాకలు వేసుకున్నవారిని బంకు యజమాని అర్ధరాత్రి దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆనందపురం ఆర్ఐ మణికంఠ, గ్రామ సచివాలయ సర్వేయర్లు, అధికారులు పాల్గొన్నారు.