Nov 16,2023 21:06

మీడియాతో ఎవి ధర్మారెడ్డి

'ఆనం' ఆరోపణలపై...
'ఎవి ధర్మారెడ్డి' ఖండన
ప్రజాశక్తి - తిరుమల
టిడిపి నాయకుడు ఆనం వెంకట రమణారెడ్డి చేసిన వ్యాఖ్యలను టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి ఖండించారు.. నిజాయితీ అధికారులపై ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపణలు చేయడం మంచి సాంప్రదాయం కాదన్నారు.. గురువారం టిడిపి నేత ఆనం వెంకటరమణారెడ్డి టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తిరుమలలోని అన్నమయ్య భవన్‌ లో టిటిడి ఈవోకౌంటర్‌ ఇచ్చారు.. ఈ సందర్భంగా టిటిడి ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆనం వెంకటరమణారెడ్డి అనే వ్యక్తి తనపై చేసిన ఆరోపణలో వాస్తవం లేదన్నారు. తనపై చాలా వైల్డ్‌ అలిగేషన్స్‌ చేయడమే కాకుండా పబ్లిక్‌ లో తన పరపతిని దెబ్బతీసేందుకు ఆనం ప్రెస్‌ మీట్‌ పెట్టారని, ఇండియన్‌ డిఫెన్స్‌ అకాడమీకి చెందిన వ్యక్తికి టీటీడీ ఈవోగా గానీ, జేఈవోగా గానీ పని చేసే అర్హత లేదని ఆనం ఆరోపణ చేసినట్లు తెలిపారు.. సెక్షన్‌ 107 ఆఫ్‌ ద ఎండోమెంట్‌ ఆక్ట్‌ ప్రకారం టిటిడి జాయింట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పని చేసే అర్హత తనకు ఉందని, దేవదాయ శాఖ చట్టం మేరకు టీటీడీ ఈవోగా నియమితుల అవ్వాలంటే జిల్లా కలెక్టర్‌ లేదా సమాన హౌదాలో పని చేసి ఉండాలని ఆయన తెలిపారు.. 1991 బ్యాచ్‌ కి చెందిన తాను ప్రిన్సిపల్‌ సెక్రెటరీ హౌదా కంటే ఎక్కువ హౌదాలో ఉన్న పోస్టులు బాధ్యతలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.. టిటిడి ఈవోగా నాకు అర్హత లేదని తిరుపతికి చేందిన ఓ వ్యక్తి హైకోర్టుకి వెళ్తే, హైకోర్టు పరిశీలించి తన నియామకంపై హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు కొట్టేసిందన్నారు.
మీడియాతో ఎవి ధర్మారెడ్డి