ప్రజాశక్తి-చీరాల: అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చీరాల నియోజకవర్గానికి సంబంధించిన చీరాల, వేటపాలెం మండలాల్లోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఆన్‌లైన్ విధానంపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించు భవనాల అనుమతులను అన్నీ ఇకపై ఆన్‌లైన్ ద్వారా ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి పంపించాలని అన్నారు. అనంతరం అనుమతులన్నీ ఆన్‌లైన్ పద్ధతి ద్వారానే మంజూరు చేస్తామని, ఇందుకు సంబంధించిన భవన నిర్మాణ ప్లాన్ తయారు చేసేవారు కూడా ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ నుంచే లైసెన్స్ పొందాలని అన్నారు. అనంతరం అంశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కె నేతాజీ మరియు, ఈఓఆర్‌డి బి మురళి, బాపూజీ, చీరాల, వేటపాలెం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.










