Apr 25,2023 21:49

ప్రజాశక్తి - ద్వారకాతిరుమల
       ప్రసిద్ధ క్షేత్రం ద్వారకాతిరుమల (చిన్న తిరుపతి) శ్రీ స్వామివారి సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం, అష్టోత్తర శతనామార్చన, గరుడోత్సవం, గోపూజ, కుంకుమ పూజ, నిత్యార్జిత కల్యాణం ఇలా 18 రకాల స్వామి వారి సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చామని ఆలయ ఇఒ వేండ్ర త్రినాధ్‌రావు తెలిపారు. ఈ సేవలు వెబ్‌సైట్‌ ష్ట్ర్‌్‌జూ://షషష.aజ్‌ూవఎజూశ్రీవర.aజూ.స్త్రశీఙ.ఱఅ ద్వారా యాత్రికులు పొందొచ్చని ఆయన చెప్పారు.