బి.కొత్తకోట/కలికిరి :
న్‌లైన్ ద్వారా మోసం చేసి నగదు తస్కరించిన ఘటన జిల్లాలోని బి.కొత్తకోట, కలికిరిలో జరిగింది. ఈ మోసానికి సంబంధించిన విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బ్యాంకు మేనేజర్లకు అందుతున్న ఫిర్యాదులను దర్యాప్తు కోసం ఆయా బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు పంపుతున్నారు. సామాన్యులే కాకుండా ఉద్యోగులు సైతం ఈ మోసానికి బలవుతున్నారు. ఫిర్యాదు లన్నింటినీ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులపై ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ఎప్పుడు ఎవరి ఖాతా నుంచి ఎంత నగదు మాయమై సెల్ ఫోన్లకు మేసేజ్ వస్తుందోనన్న భయం పట్టుకుంది.
బ్యాంకులకు ఖాతాదారుల క్యూ
బి.కొత్తకోటలో నాలుగు ప్రధాన బ్యాంకుల బ్రాంచ్‌లు, ఒక సహకార బ్యాంకు, మరికొన్ని ప్రయివేటు బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో ఖాతాలున్న వ్యక్తులు సాధారణంగా డబ్బు డ్రా చేయాలంటే బ్యాంకుకు వెళ్లి చలానా రాసిస్తాం, లేదంటే ఎటిఎంలో డ్రా చేసుకుంటాం. ఇవేవి కాదంటే ఫినో బ్యాంకింగ్, బిసి సెంటర్లకు వెళ్లి అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ఆధార్ నంబర్ ఇస్తే అకౌంట్ నుంచి డబ్బు డ్రా చేస్తారు. దీనికి ఖాతాదారుడు వేలిముద్ర వేయడం తప్పనిసరి. అయితే ఈ వేలి ముద్రలు లేకుండానే ఖాతాదారుల ఖాతాల్లో డబ్బులు మాయమె ౖపోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఖాతాదారులు బ్యాంకు మేనేజర్ల వద్దకు క్యూ కడుతున్నారు.
సమగ్ర విచారణకు చర్యలు చేపట్టిన అధికారులు
కొన్ని రోజులుగా ఫినో బ్యాంకింగ్ లేదా బిసి సెంటర్ల నుంచి డబ్బు డ్రా అవుతున్నట్టు సుమారు 50 మంది ఖాతాదారులు ఆయా బ్యాంకుల మేనేజర్లకు ఫిర్యాదులు చేశారు. తాము వెళ్లి వేలిముద్రలు వేయ లేదని, అయినా కూడా నగదు డ్రా చేసినట్టు సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు వస్తున్నాయని మేనేజర్లకు చూపించారు. తమ ప్రమేయం లేకుండా డ్రా అవుతున్న నగదును ఎవరు డ్రా చేస్తున్నారో తేల్చి న్యాయం చేయాలని ఫిర్యాదులు చేస్తున్నారు. అప్రమ త్తమైన మేనేజర్లు డబ్బు డ్రా అవుతున్న ఖాతాల నుంచి మళ్లీ డబ్బు డ్రా చేయకుండా ఫ్రీజ్ చేశారు. ఖాతాల నుంచి డబ్బును ఎవరు మాయం చేస్తున్నారనే విషయంపై ఆరా తీసే పనిలో పడ్డారు. బ్యాంకు అధికారులు, ఖాతాదారులు ఆధార్ కార్డును ఎక్కడెక్కడ వినియోగిస్తారు. అక్కడ ఆధార్‌నంబర్లు, వేలిముద్రలు ఎవరు తీసుకుంటున్నారు, ఒకసారి తీసుకున్న వేలిముద్రను మళ్లీ ఎలా విని యోగిస్తున్నారు. ఇది ఎప్పటి నుంచి ఏ సెంటర్ల నుంచి సాగుతోంది. ఎంత డబ్బును ఇలా నొక్కేశారన్న దానిపై సమగ్ర విచారణకు చర్యలు చేపట్టారు. బి.కొత్తకోటతో పాటు మరికొన్ని చోట్ల ఇదే విధంగా మోసాలు జరిగినట్టు బ్యాంకుల అధికారుల దష్టికి వచ్చింది. స్థానిక ఓ బ్యాంకు మేనేజర్ మాట్లా డుతూ తమ బ్యాంకుకు చెందిన మూడు ఖాతాల నుంచి వేలిముద్రలు లేకుండా డబ్బు డ్రా అయినట్టు ఖాతాదారులు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ ఫిర్యాదులను బ్యాంకు ప్రధాన కార్యాలయానికి పంపామని, దీనిపై సైబర్ క్రైమ్ అధికారులు విచారణ చేట్టనున్నట్టు తెలిపారు. పట్టణంలోని రెండవ సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న రాజేందర్ ఖాతా నుండి రూ.18,900 తన ప్రమేయం లేకుండా మాయమైందని, ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో సదరు ఉద్యోగి ఫిర్యాదు చేశారు. పట్టణంలోని సారధి బుక్‌స్టాల్ వెంకటరమణ ఖాతాలో నుంచి ఈ నెల 12న తన ప్రమేయం లేకుండా పదివేలు నగదు పోయిందని తెలిపారు. మండలంలో ఆరుగురు, పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన ఐదుగురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు ఉద్యోగులు, ఇటు పోలీసు అధికారులు ఆన్‌లైన్ మోసగాళ్ల ఆటకట్టించి న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
బ్యాంకు ఖాతా నుంచి డబ్బు మాయం
కలికిరి : తమ బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బులు మాయం అవడంతో బాధితులు లబోదివ్వమంటున్నారు. బాధితుల కలికిరి ఎస్‌బిఐలో పలువురి ఖాతాలో నుంచి వారం రోజులుగా ఖాతాదారులు ప్రమేయం లేకుండా నగదు మాయం అవుతుండడంతో అనుమానం వచ్చి బాధితులు బ్యాంకులో స్టేట్మెంట్ తీయగా 19వ తేదీ నుంచి కనిగిరికి చెందిన వెంకటరెడ్డి ఖాతాలో రూ.20 వేలు, శంకర్‌రెడ్డి ఖాతా నుంచి రూ.10 వేలు, సహదేవరెడ్డి ఖాతా నంచి రూ.20 వేలు, మరో మహిళ ఖాతాలో రూ.10 వేలు చొప్పున రెండు, మూడు దఫాలుగా నగదు మార్పిడి అయినట్లు గమనించి అవాక్కయ్యారు. ఆందోళన చెంది వారు బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్లి డబ్బులు మాయమవ్వడంపై ప్రశ్నించారు. బాధితులు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే ఉన్నతా ధికారుల దష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.










