ఆమదాలవలస : ఆన్‌లైన్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎపిఎం పైడి కూర్మారావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని వెలుగు కార్యాలయంలో ఆర్బిఐ పథకంలో భాగంగా యూనియన్ బ్యాంకు సౌజన్యంతో ఎస్‌ఎస్‌టి స్వచ్ఛంద సంస్థ నిర్వహణలో ఆర్థిక అక్షరాస్యత పై స్వయం శక్తి సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫలానా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని ఎవరైనా ఫోన్ చేసి అకౌంట్ వివరాలను అడిగితే అటువంటి వారికి సమాచారం ఇవ్వవద్దని సూచించారు. బ్యాంకులు ఎప్పుడూ ఖాతాదారుల వివరాలను ఫోన్ చేసి తెలుసుకోవని తెలిపారు. ఏటీఎంలలో అపరిచితులకు కార్డును ఇచ్చి డబ్బులు విత్ డ్రా చేసి పెట్టమని కోరరాదని తెలిపారు. రూపే ఏటీఎం కార్డుల ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. సైబర్ మోసాలకు గురైనప్పుడు 1930, ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్ మెన్ 14448 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు.. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు తమ్మినేని ధనలక్ష్మి, రామప్పడు, ఎంఎంఎస్ అకౌంట్ కల్యాణి, సఎఫ్‌లు ఆర్థిక అక్షరాస్యత సిఎఫ్‌ఎల్ కో ఆర్డినేటర్లు చిగురుపల్లి. వెంకటేష్ (చిన్నూ) రామారావు తదితరులు పాల్గొన్నారు.










