Oct 17,2023 20:33

.ఎ స్‌పికి వినతి పత్రం అందజేస్తున్న నాగార్జునరెడ్డి


కడప- ప్రజాశక్తి సిటీ
ఆన్‌ లైన్‌ జూదాన్ని అరికట్టడంపై సీరియస్‌గా దష్టి సారించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ వ్యవస్థ సలహాదారు నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఎస్‌పి సిద్దార్థ్‌ కౌశల్‌నుకలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా రాష్ట్ర . ప్రభుత్వ సలహాదారు సెల్‌ ఫోన్‌ ద్వారా యువత ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ బానిసలై లక్షలాది రూపాయలను పోగొట్టుకొని అప్పులు పాలవుతున్నారని చెప్పారు.ఎవరికి చెప్పలేక ఆత్మహత్యలు చేసుకుంటు న్నారన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే వందల మంది చనిపోయారని తెలిపారు. ఈ ఆన్‌లైన్‌ జూదాన్ని అరికట్టకపోతే చాలామంది యువత చనిపోయే ప్రమాదం ఉందన్నారు .దీనిని అరికట్టాలంటే కేంద్ర నిఘా సంస్థల సహకారంతో కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు .టీవీలలో ఆన్‌లైన్‌ గేమ్‌ ప్రకటనలు ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌పి తీసుకెళ్ళామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, డిజిపి దష్టికి తీసుకెళ్తానని చెప్పారు