ఆన్‌లైన్ చెస్‌టోర్నమెంట్‌లో లక్ష్మీ మనుశ్రీ ప్రతిభ
కడప : బెంగుళూరు రూరల్ జిల్లా చెస్ అసోసియేషన్ నిర్వహించిన జాతీయస్థాయి ఆన్లైన్ చెస్ టోర్నమెంట్ లో అండర్-9 బాలికల విభాగంలో కడప నగరానికి చెందిన లక్ష్మి మను శ్రీ అద్భుతంగా రాణించి ఐదవ స్థానంలో నిలిచింది. www.chess.com లో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో 204 మంది చెస్ క్రీడాకారులు ఆన్‌లైన్‌లో పోటీపడ్డారు. 10 రౌండ్లకు 4 పాయింట్లు సాధించి లక్ష్మి బహుమతిని సాధించింది. కడప నగరానికి చెందిన తేజోమయి, ఖ్యాతి మై, స్పందన, చరిత్, భద్ర, గుడవర్ధన్, ప్రణవ్ కూడా టోర్నమెంట్ లో పాల్గొని రాణించారని వైయస్సార్ జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి కార్యదర్శి అనీస్ దర్బారి తెలిపారు.










