డిఎస్‌పి సునీల్
ప్రజాశక్తి-అనకాపల్లి
అనకాపల్లి డిఎస్‌పిగా పనిచేసిన బి.సునీల్‌ను బదిలీ వేటు పడినట్లు తెలిసింది. ఈ మేరకు చీఫ్ ఆఫీసు నుంచి ఆదేశాలు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల బోగట్టా. సుమారు రెండేళ్లగా డిఎస్‌పిగా పనిచేస్తున్న సునీల్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. ఎక్సైజ్ శాఖ సీజ్ చేసిన వాహనాన్ని వినియోగించినందుకు ఆయనను తీవ్రంగా మందలించిన ఎస్పీ, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీఎస్పీ సునీల్ సెలవుపై వెళ్లారు. అయితే హెడ్ క్వార్టర్ చీఫ్ ఆఫీస్ నుంచి ఆయన్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది. సునీల్‌ను విఆర్‌లో ఉంచినట్టు బోగట్టా. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జి డిఎస్‌పిగా దిశ పోలీస్ స్టేషన్ డిఎస్‌పి మళ్ల మహేశ్వరరావును నియమిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు.










