Dec 03,2022 00:07

ఇదేం కర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పీలా

ప్రజాశక్తి-అనకాపల్లి
మూడున్నరేళ్ల వైసిపి పాలనలో అనకాపల్లి అభివృద్ధిపై ప్రజల మధ్య చర్చించేందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్‌ సిద్ధమా అని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ సవాల్‌ విసిరారు. స్థానిక గాంధీనగరం అంజయ్య కాలనీలో శుక్రవారం టిడిపి నియోజకవర్గ పరిశీలకులు బొర్రా నాగరాజుతో కలిసి ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీలా మాట్లాడుతూ వైసిపి పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలే అభివృద్ధి చెందారని ఎద్దేవా చేశారు. చెత్తపై కూడా పన్ను వేసే చెత్త ప్రభుత్వం వైసిపి అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పోలవరపు త్రినాథ్‌, సురేంద్ర, బొద్ధపు ప్రసాద్‌, పిట్ల రాజు, పూడి చిన్నారావు, ఎల్లపు వెంకటరమణ, ఆకుల నానాజీ, ధనుంజరు, ఆకుల వెంకట అప్పారావు, సూరే సతీష్‌, పిట్ల హరీష్‌, పూడి త్రినాధరావు, ముప్పిడి మణికంఠ, దేవి, ఆళ్ల జగన్‌, కొయ్యలాడ గణేష్‌ పాల్గొన్నారు.
పోస్టర్‌ ఆవిష్కకరణ
యలమంచిలి రూరల్‌ : ఇదేం కర్మ వాల్‌ పోస్టర్‌ను స్థానిక టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పప్పల చలపతిరావు, పార్టీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు, ఇతర నాయకులు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రాజాన రమేష్‌ కుమార్‌, ధూళి రంగనాయకులు, గొర్లె నానాజీ, బొద్ధపు రమణ, ఇతర నాయకులు పాల్గొన్నారు.