Jan 04,2023 23:56

హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేస్తున్న అధికారులు

ప్రజాశక్తి-కోటవురట్ల: మండలంలో ఎండపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేస్తున్న అనధికారిక లే అవుట్‌పై మండల అధికారులు కొరడా ఘులిపించారు. సర్వే నెంబర్‌ 29, 30-1,30-2,30-3, 31-3లో 3.44 ఎకరాల విస్తీర్ణం కు సంబంధించి ఎటువంటి దరఖాస్తు, అనుమతులుగాని పొందకుండా పనులు చేపడుతున్న విషయంపై ఈనెల 2న అనధికారికంగా లే అవుట్ల పేరుతో ప్రజాశక్తిలో వచ్చిన కథనానికి తహశీల్దార్‌ జానకమ్మ, గ్రామస్థాయి అధికారులు సతీష్‌, స్థానిక సర్పంచ్‌ పావని కొరడా ఘులిపించారు. మేరకు సంబంధిత సంబంధిత భూమిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అనుమతులు పొందనందున సదరు భూమి స్థలాలు కొనుగోలు చేయరాదని, అదేవిధంగా విక్రయించరాదని బోర్డులో తెలిపారు.. లే అవుట్‌ నిబంధనలను అధికారులు సూచించారు.
ఆ నిబంధనలు ఇలా ఉన్నాయి:
తొలిత గ్రామపంచాయతీకి దరఖాస్తు చేసుకోవాలి వాటిని పంచాయతీ సెక్రెటరీ పరిశీలించాలి. సక్రమంగా లేక పోతే తిరస్కరించాలి. అన్ని సక్రమంగా ఉంటే పంచాయతీ సెక్రెటరీ టెక్నికల్‌ అదారిటికి పంపిస్తారు. టెక్నికల్‌ అథారిటీ లేఔట్ల వద్ద అన్ని వసతులు కల్పించాలని ఆదేశాలు ఇస్తుంది. వసతుల్లో ప్రధానమైనవి మంచినీటి సౌకర్యం, వీధి దీపాల సౌకర్యం కల్పించాలి. లేఅవుట్‌ స్థలం ఉమ్మడి భూమి పై ఉండకూడదు. ఉమ్మడి స్థలం అయితే గనుక పంచాయతీ పేరు మీద రిజిస్టర్‌ చేయించాల్సి ఉంటుంది. ఈ వసతులు నిర్ణిత సమయంలోనే పూర్తి చేయాలి. తదుపరి పంచాయతీ సెక్రటరీ వసతులు పరిశీలించి సక్రమంగా ఉన్నట్లయితే ఆమోదానికి పంపుతారు. తదుపరి టెక్నికల్‌ టీం పరిశీలిస్తుంది. వసతుల కల్పన టెక్నికల్‌ టీము ఆమోదం పొందిన తరువాత లేఅవుట్లో 15శాతం భూమి పంచాయతీ పేరు మీద మార్ట్‌ గేజ్‌ చేయాల్సి ఉంటుంది. లే అవుట్‌ వద్ద వసతుల కల్పన సక్రమంగా లేకపోతే పంచాయతీ పేరు మీద గల 15శాతం భూమి విక్రయించి వసతులు కల్పిస్తారు. అదేవిధంగా లేవట్‌ కు సంబంధించి రోడ్డు విస్తీర్ణం 33 అడుగులు ఉండాల్సి ఉంటుంది. వీటన్నింటి కంటే ముందు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలంటే ప్రభుత్వానికి మార్కెట్‌ విలువలో 9శాతం చెల్లించాల్సి ఉంటుంది.