
- పంగులూరులో భారీ ర్యాలీ
- సైకిల్ యాత్రలో ఎంఎల్‌ఎ గొట్టిపాటి
- పెద్ద ఎత్తున కదిలిన టిడిపి కార్యకర్తలు
ప్రజాశక్తి - పంగులూరు
అధికార మదంతో ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని ఎవరు ఆపలేరని ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఆపాలనుకోవడం అవివేకమే అవుతుందని అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మండలంలోని అలవలపాడు నుండి చందలూరు వరకు భారీ సైకిల్ యాత్ర గురువారం నిర్వహించారు. అలవలపాడు, చందలూరు గ్రామాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుతో చంద్రబాబుకి ఎలాంటి సంబంధం లేకపోయినా అక్రమంగా కేసులు బనాయించి నిర్బంధించారని ఆరోపించారు. చంద్రబాబును అరెస్టు చేసిన తీరు జగన్ కక్షసాధింపుకు నిదర్శనమని అన్నారు. అక్రమ అరెస్టుకు నిరసనగా గ్రామస్థాయిలో కార్యకర్తలు నిరసన చేపడుతుంటే ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి అణిచివేయాలని చూస్తుందని అన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు అనునిత్యం కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు మొదట రూ.3వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పి తరువాత రూ.30కోట్ల అంటూ చివరికి రూ.27కోట్ల అంటూ కూడా ఆధారాలు చూపలేకపోతున్నారని అన్నారు. చంద్రబాబు అవినీతి చేయలేదు కాబట్టే సిఐడి అధికారులు ఎలాంటి ఆధారాలు చూపలేకపోతున్నారని అన్నారు. న్యాయస్థానాలను, వ్యవస్థలను తప్పుదో పట్టిస్తూ చంద్రబాబును జైలు నిర్బంధంలో ఉంచారని అన్నారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైల్లో కనీస వసతులు కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. జైలులో చంద్రబాబును ఇబ్బందిపెడుతున్న తీరు చూస్తుంటే జగన్మోహన్‌రెడ్డి ఎలాంటి సైకోనో అర్థం చేసుకోవచ్చని అన్నారు. సైకో పాలనకు చమర గీతం పాడే రోజు అతి దగ్గరలోనే ఉందని అన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు అవసరం పట్ల ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని కోరాడు. సుమారు 10కిలోమీటర్ల దూరం సాగిన సైకిల్ యాత్రలో ఎమ్మెల్యే రవికుమార్ స్వయంగా సైకిల్ తొక్కుతూ కార్యకర్తలను ఉత్సాహపర్చారు. కార్యక్రమంలో పంగులూరు మండల టిడిపి అధ్యక్షులు రావూరి రమేష్, మాజీ జెడ్పిటిసి కరి సుబ్బారావు, టిడిపి మాజీ అధ్యక్షులు చింతల సహదేవుడు, కుక్కపల్లి ఏడుకొండలు, బెల్లంకొండ దశరథ, మురకొండ సుబ్బారావు, కోమటి ప్రసాద్, మీరావలి, జగన్ మోహనరావు, చందలూరు సర్పంచి కృష్ణయ్య, ఎంపిటిసి వాసవి, టిడిపి గ్రామ అధ్యక్షులు పెంట్యాల నాగభూషణం, ఈశ్వరమ్మ, ఉన్నం రవి, తెలుగు యువత నాయకులు జాగర్లమూడి పూర్ణచంద్రరావు, బొప్పూడి నాగేశ్వరరావు, అల్లం నేని స్వాములు, ఇంటూరి రామకృష్ణ, గొట్టిపాటి కాజా స్వామి, గొట్టిపాటి వెంకటరావు, నార్ని సుబ్బారావు, ఆదిరెడ్డి, కేశినేని మల్లేశ్వరరావు, తెలగతోటి రాధాకృష్ణ, మాజీ సర్పంచి అమర్తపూడి ఏసోబు, జాగర్లమూడి కోటేశ్వరరావు, ఎల్లాల నాగిరెడ్డి, ఎల్లాల నర్సారెడ్డి పాల్గొన్నారు.