భవిత పాఠశాలకు ఎల్‌ఇడి టీవీ వితరణ చేస్తున్న ఆదినారాయణరాజు
ప్రజాశక్తి- గాజువాక : అనాథ, వృద్ధాశ్రమాల్లో కన్నతల్లి జన్మదిన వేడుకలను నిర్వహిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న పెన్మెత్స ఆదినారాయణరాజును పలువురు అభినందించారు. భీమవరం జిల్లా, అత్తిలి మండలం ఈడూరు గ్రామానికి చెందిన ఆదినారాయణరాజు, తన తల్లి పెన్మెత్స రాజేశ్వరమ్మ 90 వసంతాలు పూర్తి చేసుకొని 91వ ఏట అడుగు పెడుతున్న సందర్బంగా నల్లి బాబురావు ట్రస్ట్‌లో పిల్లలతోపాటు నిస్సి హోంలో పిల్లలకు అల్పాహారం, పండ్లు, బిస్కెట్‌లు పంపిణీ చేశారు. వడ్లపూడి భవిత పాఠశాలకు ఎల్‌ఇడి టీవీ వితరణ చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ ఎస్‌కెఎల్ రావు, డైరెక్టర్ దాసరి బుజ్జి, వలరౌతు వెంకటరమణ, కర్రి నాయుడు, బంగారు నాయుడు, కోయిలాడ శ్రీనివాసరావు, పెన్మత్స కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.










