ప్రజాశక్తి - కోసిగి
కోసిగి ఆర్టిసి బస్టాండులో కొద్దిరోజులుగా ఉంటున్న అనాథ మహిళ (45) సోమవారం మృతి చెందడంతో సర్పంచి అయ్యమ్మ, ఇన్ఛార్జీ ఇఒ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు వైసిపి సీనియర్ నాయకులు మాణిక్యరాజు, యువ నాయకులు రాజేష్ సమక్షంలో పంచాయతీ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడంతో సర్పంచి అయ్యమ్మను, వైసిపి సీనియర్ నాయకులను గ్రామస్తులు ప్రశంసించారు. పంచాయతీ సిబ్బంది రాజు, శీను, తాయన్న, నరసింహులు, పెద్ద ఈరన్న పాల్గొన్నారు.