Jul 11,2023 22:33

మృతదేహం వద్ద నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే, తదితరులు

ప్రజాశక్తి బత్తలపల్లి : మండలంలోని ఈదుల ముష్టూరు గ్రామానికి చెందిన వైసిపి సీనియర్‌ నాయకులు ఎంసి. నరసింహారెడ్డి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ధర్మవరం, తాడిపత్రి, పెనుకొండ, అనంతపురం ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాలగుండ్ల శంకరనారాయణ, అనంత వెంకటరామిరెడ్డి తదితరులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. నరసింహారెడ్డితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎపి కురుబ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోటి సూర్యప్రకాష్‌ బాబు, జెడ్పీటీసీ కోటి సుధ, నాయకులు ఆగ్రహారం ఓబిరెడ్డి గొల్లపల్లి రామకృష్ణారెడ్డి, గుర్రం శ్రీనివాసరెడ్డి, జగ్గిన జయపరెడ్డి, కమతం ఈశ్వరయ్య. జయరామిరెడ్డి, తాడిమర్రి ఎంపీపీ పాటిల్‌ భువనేశ్వరరెడ్డితో పాటు టీడీపీ నాయకులు గోనుగుంట్ల విజరు కుమార్‌, కరణం సూర్యప్రకారావు, సురేంద్రరాయుడు శ్రీనివాసులు, సీసీఐ నాయకులు కమతం కాటమయ్య తదితరులు పాల్గొన్నారు.